సంక్రాంతి సంబరాలలో మెగా హీరోలు

Published on Jan 15, 2020 12:27 pm IST

సంక్రాంతి సంబరాలకు మెగా హీరోలందరూ ఓ చోట చేరారు. మెగా ఫ్యామిలీ పెద్ద చిరంజీవి చుట్టూ చేరి ఫోటోలకు ఫోజులిచ్చారు. చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్న మెగా హీరోలందరూ ఆ ఫోటోలు కనిపించడం విశేషం. అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్,అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ అందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐతే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కనిపించడం విశేషం. సంక్రాంతి సంబరాల కోసం ఈ యంగ్ ఫెలో మెగా ఫ్యామిలీతో జాయిన్ అయ్యాడు.

ఇక మెగా హీరోలు ఈ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు.ఇటీవల విడుదలైన వీరి చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేశాయి. గత ఏడాది విడులైన సైరా, ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బన్నీ అల వైకుంఠపురంలో చిత్రంతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టాడు. రన్ పూర్తయ్యే నాటికి ఈ చిత్రం చాలా రికార్డ్స్ నమోదు చేసే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More