ఖైదీ నెం.150 ఆడియో విడుదల తేదీ ఖరారు !
Published on Dec 13, 2016 5:01 pm IST

khaidi150
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.150 ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఆడియో వేడుకకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో వేడుకని ఈ నెల 25 న విజయవాడలో జరపడానికి నిర్ణయించారు.

వివి వినాయక్ దర్శకత్వం వచిస్తున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు హాజరవుతుండగా భారీస్థాయిలో వేడుకని జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ధృవ చిత్రం విజయం సొంతం చేసుకోవడంతో సంతోషంలో ఉన్న మెగా ఫాన్స్ కు ఖైదీ నెం.150 ఆడియో వేడుకమరింత ఉత్సాహాన్ని కలిగించనుంది.

 
Like us on Facebook