‘అసురన్’ పై ఇంట్రస్ట్ గా ఉన్న రామ్ చరణ్ !

Published on Oct 22, 2019 4:49 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా విదులైన ఓ తమిళ్ సినిమాని రీమేక్ చేయటానికి ఇంట్రస్ట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమా రీమేక్ రైట్స్ కోసం చరణ్ ప్రయత్నం చేస్తోన్నాడట. పక్కా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా తన‌కు బాగా సూట్ అవుతుందని చరణ్ భావిస్తున్నారు. పైగా సినిమా కూడా ప్రేక్ష‌కుల నుండే కాకుండా విమ‌ర్శ‌కుల నుండి కూడా ప్ర‌శంస‌లను అందుకుంది.

అయితే ఈ వార్తకు సంబంధించి మెగా హీరో ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇటీవలే ఈ సినిమా చూసి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చాల బాగుందని ట్వీట్ చేస్తూ అప్రిషియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘అసురన్’ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా వి క్రీయేషన్స్ పతాకం ఫై కలైపులి ఎస్ థాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More