అఫీషియల్ : మెగాస్టార్ ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 21, 2023 10:30 pm IST

ఇటీవల గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు సక్సెస్ లు సొంతం చేసుకుని కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక లేటెస్ట్ గా ఆయన హీరోగా నటిస్తున్న మూవీ భోళా శంకర్. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ సంస్థల పై ఎంతో భారీ ఎత్తున నిర్మితం అవుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేంగా జరుగుతోంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ కి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీని ఆగష్టు 11న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా దర్శకుడు మెహర్ రమేష్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా భోళా శంకర్ మూవీ రిలీజ్ తరువాత పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని యూనిట్ అభిప్రాయపడుతోంది.

సంబంధిత సమాచారం :