నేటితరం జార్జిరెడ్డితో కనెక్ట్‌ అవుతారు – మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 19, 2019 8:00 pm IST

‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జ్ రెడ్డి’’. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ నవంబర్ 22న విడుదల కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకి చాలామంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ సపోర్ట్ కూడా ఈ సినిమాకి దొరికింది. ఈ సినిమాలోని ‘అడుగు అడుగు’ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘1972లో ఒంగోలులో ఇంటర్‌ చదువుతున్న సమయంలో నేను మొదటిసారి జార్జిరెడ్డి అనే పేరు విన్నాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వింటున్నాను. ‘జార్జిరెడ్డి: ఎ మ్యాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ పేరుతో తీస్తున్న ఈ చిత్రంలోని ‘అడుగు.. ఆడుగు’ పాటను చూసిన తర్వాత ఎక్సైట్‌ కు లోనయ్యాను. ఈ సినిమాకి సంబంధించి నేను విన్నదాన్ని బట్టి, ఆయన ఎలాంటి ఆశయాలతో ఉండేవారు ? ఏ విధంగా విప్లవకారుడిలా ఉండేవారు? అన్యాయం జరిగినా విద్యార్ది నాయకుడిగా జార్జిరెడ్డి ఎలా స్పందించే వారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారని అనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి. నేటితరం జార్జిరెడ్డితో కనెక్ట్‌ అవుతారని, ఈ కంటెంట్‌ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని మనస్పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడండి. నేను కూడా ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’అని తెలిపారు.

‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా
బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్ తదితరులు సాంకేతికవర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటించటం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More