రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పిన మెగాస్టార్ !

30th, April 2017 - 12:39:03 PM


ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఎవరి నోటి వెంట చూసినా రాజమౌళి మాటే వినిపిస్తోంది. ఆయన ప్రతిభను పొగడని వారంటూ లేరు. దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు అందరూ జక్కన్నను అభినందిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శక ధీరుడిని ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.

కొద్దిసేపటి క్రితమే ఆయన ‘బాహుబలి 2’ పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘బాహుబలి 2 ఒక అద్భుత చిత్రం. ఇంత గొప్ప సినిమాను తీసినందుకు రాజమౌళికి అన్ని ప్రశంసలు దక్కాలి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి పెంచినందుకుగాను రాజమౌళికి నా హ్యాట్సాఫ్. సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, ఇతర నటీనటులకు, మరీ ముఖ్యంగా కీరవాణి, సెంథిల్ కుమార్, విజయేంద్ర ప్రసాద్ లకు నా అభినందనలు’ అన్నారు.