వైరల్ వీడియో : యాక్టర్ సుమన్ 45 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ కెరీర్ పై మెగాస్టార్ విషెస్

Published on Feb 15, 2023 7:44 pm IST


టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ సుమన్ మనకు అందరికీ సుపరిచితం. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో సైతం ఆయన అనేక సినిమాలు చేసారు. ఇక హీరోగా చిరంజీవి వంటి వారితో పాటు తన సినీ కెరీర్ ని ఆరంభించిన సుమన్ సినీ జీవితంలో ఎన్నో గొప్ప సక్సెస్ లు ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలోని శ్రీవేంకటేశ్వరుని పాత్రలో సుమన్ నటనకు గొప్ప ప్రసంశలు దక్కాయి.

అయితే విషయం ఏమిటంటే, నటుడిగా సుమన్ సక్సెస్ఫుల్ గా 45 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. నటుడిగా ఎన్నో పాత్రల్లో నటించి పలు భాషల ఆడియన్స్ యొక్క క్రేజ్, అభిమానాన్ని సంపాదించిన సుమన్ రాబోయే రోజుల్లో మనల్ని అందరినీ మరింతగా అలరించాలని అలానే ఫిబ్రవరి 16న బెంగళూరులో సుమన్ 45 ఏళ్ళ ప్రస్థానం ఈవెంట్ పెద్ద సక్సెస్ కావాలని కోరుతూ కొద్దిసేపటి క్రితం చిరంజీవి విడుదల చేసిన వీడియో బైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :