ప్రభాస్ కు ఆసక్తికర విషెష్ చెప్పిన మెగాస్టార్.!

Published on Oct 23, 2020 12:46 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందు చిరు చేసిన బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా “సైరా నరసింహా రెడ్డి” చిత్రం పాన్ ఇండియన్ రిలీజ్ ప్లాన్ చెయ్యడానికి ప్రభాస్ చేసిన బాహుబలి సినిమానే కారణం అని సభాముఖంగా చిరు అప్పుడు తెలియజేసారు.

అలా సైరా టైం లో ప్రభాస్ తో కలిసి తీసుకున్న ఫోటో పెట్టి తన సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ కు ఆసక్తికరంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. డియర్ ప్రభాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అలాగే ఇక నుంచి ఈ ఏడాది నీ అద్భుతమైన లైనప్ సినిమాలతో బాగుండాలని కోరుతూ ఆసక్తికర పోస్ట్ తో విష్ చేసారు. ప్రభాస్ ఇప్పుడు మొత్తం మూడు భారీ పాన్ ఇండియన్ చిత్రాల లైనప్ తో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వాటినుద్దేశించి చిరు ప్రభాస్ లైనప్ పట్ల ఆసక్తి రేకెత్తించారు.

సంబంధిత సమాచారం :

More