దేశ ప్రధానికి మెగాస్టార్ స్పెషల్ విషెష్.!

Published on Sep 17, 2020 9:49 am IST

ఈరోజు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు కావడంతో దేశ మహామవులు అంతా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన పెద్దలు మరియు అగ్ర తారలు కూడా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలా మన టాలీవుడ్ నుంచి లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పెషల్ విషెష్ ను ప్రధాని మోడీకి కన్వే చేసారు.

“మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 70 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ దేశాన్ని మీరు అదే శక్తితో మరెన్నో సంవత్సరాలు పాలించాలని కోరుకుంటున్నా”నాని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ప్రధాని మోడీకి మన తెలుగు ఇండస్ట్రీ పట్ల కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంతో పాటుగా మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More