సాహిత్యానికి ఇది చీకటి రోజు – మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 30, 2021 9:01 pm IST


సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తో ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక గా సినీ పరిశ్రమ కి చెందిన వారు తమ భావాలను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సిరివెన్నెల మనకిక లేదు, సాహిత్యానికి ఇది చీకటి రోజు అంటూ చెప్పుకొచ్చారు చిరు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెళుతున్న సమయం లో తనతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం బాగోలేదని తెలిసి, మద్రాస్ లో ఒక మంచి హాస్పిటల్ లో ఉందని, జాయిన్ అవుదురు గానీ అన్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడే జాయిన్ అవుతాను, నెలాఖరు లోపు వచ్చేస్తాను అని, అప్పటికి ఉపశమనం రాకపోతే అలా వచ్చేస్తా అని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించ లేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాల విషయం లో, తనతో ఉన్న అనుబంధం విషయం పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం అయ్యారు.

సంబంధిత సమాచారం :