‘సైరా’ పై క్లారిటీ ఇచ్చిన ‘చిరు’ !

Published on Aug 4, 2019 6:32 pm IST

స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా విడుదల మారనుందని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. కాగా మెగా కోడలు ఉపాసన తన మామ (చిరంజీవి)గారిని చేసిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ సైరా సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు.

సైరా తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రమని.. పైగా మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం కానుకగా అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందాన్నిస్తోందని మెగాస్టార్ తెలిపారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :