మెగాస్టార్ మాస్ టైటిల్ తో సూపర్ స్టార్ మహేష్.?

Published on Dec 12, 2020 1:30 am IST

మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే మైండ్ బ్లోయింగ్ డాన్స్ మూమెంట్స్ మాత్రమే కాకుండా పక్కా మాస్ ఇమేజ్ కూడా గుర్తుకు వస్తుంది. మాస్ లో అపారమైన ఆదరణ దాదాపు నాలుగు దశాబ్దాల పాటుగా ఏక ఛత్రాధిపత్యంతో నిలుకుంటూ వస్తున్నారు.

మరి అలాంటి చిరు చేసిన ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమా మాస్ టైటిల్ మరో మాస్ అండ్ క్లాస్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ కు పడితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మరో లెవెల్లో ఉంటుంది. మరి అందుకు ఇప్పుడు ఆస్కారం ఉండే లానే ఉందని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ నటించిన ఒకప్పటి మాస్ ఎంటర్టైనర్ “స్టేట్ రౌడీ” సినిమా టైటిల్ ను మహేష్ మరియి వంశీ పైడిపల్లి కాంబోకు పరిశీలనలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇదే కనుక నిజం అయితే మరోసారి మెగా సూపర్ సెలబ్రేషన్స్ మొదలు అవుతాయని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” అలాగే చిరు “ఆచార్య” సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :