“ఆచార్య” ఈ రేస్ నుంచి తప్పుకుందా.?

“ఆచార్య” ఈ రేస్ నుంచి తప్పుకుందా.?

Published on Oct 1, 2021 10:08 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “ఆచార్య”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకుని ఉన్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది ఎప్పుడు నుంచో సందిగ్ధంలో ఉన్న ప్రశ్న. దీనితో ఇది కాస్తా మిస్టరీ గానే మిగిలిపోయింది. అయితే సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దాదాపు సంక్రాంతి రేస్ లోనే ఫిక్స్ అయ్యింది అని టాక్ ఉంది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆచార్య ఈ రేస్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదెప్పుడు వస్తుంది అన్నదానికి క్రిస్మస్ రేస్ లో బహుశా ఈ సినిమా రావొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు