నాగార్జున స్థానాన్ని భర్తీ చేయనున్న మెగా స్టార్ చిరంజీవి
Published on Sep 7, 2016 4:19 pm IST

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు పరిశ్రమలో ఎనలేని క్రేజ్. హీరోగా సినిమా చేసి 8 ఏళ్ళు గడిచినా ఆయన నెంబర్ 1 స్థానం అలాగే పదిలంగా ఉంది. అంతటి ఛరీష్మా ఉన్న ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తొలిసారి ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అదే మా టీవీలో ఇంతకు మునుపు నాగార్జున వ్యాఖ్యాతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. అమితాబ్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు అనుకరణగా వచ్చిన ఈ గేమ్ షోను మొదటి మూడు సీజన్లలో అక్కినేని నాగార్జున లీడ్ చేశారు.

ఇక నాలుగవ సీజన్ ను మెగాస్టార్ లీడ్ చేయనున్నారు. ఈ షో 12 డిసెంబర్ నుండి ప్రసారం కానుంది. దీంతో మెగా అభిమానులంతా చిరంజీవిని ఎప్పుడెప్పుడు బుల్లి తెర మీద చూద్దామా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మాటీవీ యాజమాన్యం కూడా చిరంజీవి రాకతో షో మరింత హిట్టవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గతంలో నాగార్జున, చిరంజీవి ఇద్దరూ మా టీవీ ఛానల్ లో స్టాక్ హోల్డర్స్ గా ఉన్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook