వైరల్ : “RRR” ఆస్కార్ విన్నర్స్ కి మెగాస్టార్ చిరు సత్కారం.!

Published on Mar 28, 2023 2:55 pm IST

మన ఇండియన్ సినిమాని గర్వపడేలా చేసిన రౌద్రం రణం రుధిరం సినిమాకి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు ఆస్కార్ అవార్డును కూడా తీసుకొచ్చి యావత్తు తెలుగు సినిమాని ఇండియన్ సినిమా దగ్గర టాప్ లో తీసుకెళ్లి పెట్టింది. మరి దీనికి ప్రధాన కారణాల్లో ఒకరైన దర్శక దిగ్గజుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ ల సెన్సేషనల్ కాంబో అని చెప్పాలి.

వీరి కలయికలో వచ్చిన నాటు సాంగ్ ఖండాంతరాలు దాటి దేశానికి ఆస్కార్ ని తీసుకొచ్చింది. దీంతో మెగాస్టార్ అయితే నిన్న చరణ్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి దంపతులకి సహా మిగతా ముఖ్యులు అందరికీ కూడా తన ఇంటికి ఆహ్వానించి చిరు సత్కారం చేసినట్టుగా తెలిపారు. మరి దీనిపై ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసి చిరు ఆనందం వ్యక్తం చేశారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :