మెగాస్టార్ “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక కి డేట్ ఫిక్స్!

మెగాస్టార్ “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక కి డేట్ ఫిక్స్!

Published on Apr 8, 2022 10:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ను ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను ఏప్రిల్ 24 వ తేదీన యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించ నున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు