మెహబూబా ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది: దిల్ రాజు

టాలీవుడ్ లో దాదాపు అగ్రహీరోలందరితో వర్క్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. తనదైన శైలి దర్శకత్వంతో మెప్పించగల పూరి చాలా రోజుల తరువాత తన నుంచి ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీని తీసుకురాబోతున్నాడు. మెహబూబా సినిమాతో తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా లాంచ్ చేస్తూన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే సినిమా టీజర్ మాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అయితే సినిమాను రిలీజ్ చేస్తోన్న దిల్ రాజు రీసెంట్ గా దర్శకుడి గురించి కొన్ని విషయాలను తెలిపారు.

పూరి జగన్నాథ్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన డైరెక్షన్ మేకింగ్ స్టైల్ ఎవ్వరికి లేదు. ఆయన దగ్గర మాత్రమే డిఫెరెంట్ స్టైల్ కనిపిస్తుంటుంది. సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ లాంటి సినిమాలు చేశారు. మెహబూబా చుసిన తరువాత మెహబూబా తో మరోసారి తన మ్యాజిక్ ను రీ క్రియేట్ చేశాడని చెప్పగలను. కెరీర్ లో విజయాలు అపజయాలు సాధారణం అంటూ.. మెహబుబాబా తప్పకుండా ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని, అందరికి నచ్చుతుందని దిల్ రాజు తెలిపారు. ఛార్మి కౌర్ వర్కింగ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన ఈ సినిమా మే 11న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.