బెల్లంకొండ శ్రీనివాస్ సరసన మరో హీరోయిన్ !
Published on Aug 19, 2018 1:44 pm IST

నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తన 5 వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. కాగా తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ మెహ్రీన్ కూడా న‌టిస్తున్నారు. ఈ రోజు నుంచి మెహ్రీన్‌ షూట్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమెకు హీరోకు మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తుండగా హ‌ర్షవ‌ర్ధన్ రాణే కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook