‘ఏబిసిడి’ నుండి ‘మెల్ల మెల్లగా’.. !

‘ఏబిసిడి’ నుండి ‘మెల్ల మెల్లగా’.. !

Published on Apr 29, 2019 7:07 PM IST

యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబిసిడి’. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘మెల్ల మెల్లగా’ వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు.

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? కంటెంట్ పరంగా చూసుకుంటే ‘ఏబిసిడి’లో విషయం కాస్త గట్టిగానే ఉందనిపిస్తోంది. మరి ఈ సినిమానైనా అల్లు శిరీష్ కి భారీ హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు