‘మేమ్ ఫేమస్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ డీటెయిల్స్

Published on Jun 3, 2023 12:05 am IST

సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ మేమ్ ఫేమస్. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంస్థల పై నిర్మితం అయిన ఈ యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ దిశగా దూసుకెళుతోంది. ఈ మూవీ ద్వారా చాలా మంది నూతన నటులు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. తమ మూవీకి రెండవ వారంలో కొత్త సెంటర్లు కూడా యాడ్ చేయబడుతున్నాయని మేకర్స్ తాజాగా తెలియజేసారు.

ఈ విలేజ్ డ్రామా మూవీలో సుమంత్ ప్రభాస్‌కు జోడీగా సారయా నటించింది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సిరి రాసి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించగా కళ్యాణ్ నాయక్ స్వరాలు సమకూర్చారు. విషయం ఏమిటంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారం మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు, ఇది ప్రపంచవ్యాప్తంగా రూ. 5.25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో మేమ్ ఫేమస్ మూవీ ఇంకెంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :