“మేమ్ ఫేమస్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Jun 5, 2023 7:00 pm IST

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మేమ్ ఫేమస్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం స్టార్టింగ్ నుండి మంచి ప్రమోషన్స్ తో హైప్ ను సంపాదించుకుంది. బ్రేక్ ఈవెన్ సాధించడం మాత్రమే కాకుండా, మంచి ప్రాఫిట్స్ లోకి కూడా వచ్చింది. ఈ చిత్రం 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.1 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. చిన్న చిత్రం గా రిలీజై మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా మేమ్ ఫేమస్ అనే హిట్ చిత్రాన్ని అందించాయి. నూతన దర్శకుడు సుమంత్ ప్రభాస్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతను ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సార్య, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సిరి రాసి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :