డే 2 కూడా సూపర్ స్ట్రాంగ్ గా “మేమ్ ఫేమస్” వసూళ్లు.!

డే 2 కూడా సూపర్ స్ట్రాంగ్ గా “మేమ్ ఫేమస్” వసూళ్లు.!

Published on May 28, 2023 1:00 PM IST

టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “మేమ్ ఫేమస్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం మంచి బజ్ అండ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కాగా ఈ చిత్రం మొదటి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. మరి డే 1 కి ఈ చిత్రం 1.1 కోట్లు గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా ఈ చిత్రం స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరచడం విశేషం.

మరి రెండో రోజు కూడా ఈ చిత్రం ఒక కోటికి పైగా గ్రాస్ ని వసూలు చేసి మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమా 2.25 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరింది. ఎంతోమంది డెబ్యూ టీం తో వచ్చిన ఈ చిత్రం ఇలాంటి నంబర్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా చాయ్ బిస్కెట్ వారు నిర్మాణం వహించగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎంతో సపోర్ట్ ఈ చిత్రానికి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు