మహేష్ ఎంకరేజ్ మెంట్ కి సంతోషం లో మేమ్ ఫేమస్ టీమ్!

Published on May 25, 2023 6:35 pm IST


చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేకుండా, కంటెంట్ ఉంటే ఎవరినైనా ఆకట్టుకుంటుంది అని చెప్పడానికి మరో ఉదాహరణగా మారింది మేమ్ ఫేమస్. సినీ వర్గాల్లో మాత్రమే కాకుండా, ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. సుమంత్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ గా యంగ్ టాలెంట్ తో తీసిన ఈ సినిమా పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ చేసిన పోస్ట్ కి నిర్మాత శరత్ చంద్ర రెస్పాండ్ అయ్యారు.

అయితే నెక్స్ట్ కూడా సుమంత్ ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నాం అని, దాన్ని మీరు నిర్మిస్తే మాకు గౌరవం గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. దానికి మహేష్ కూడా డన్ అని అన్నారు. మాకు ఇంత ఎంకరేజ్ మెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషం గా ఉన్నాం అని, థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :