అమోఘం తారక్.. దుమ్ము లేపారు – మెగాస్టార్ చిరంజీవి

Published on Mar 27, 2020 6:38 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన ఈ వీడియో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. కాగా ఈ వీడియో పై మెగాస్టార్ ట్వీట్ చేశారు. ‘అదిరింది రాజమౌళి.. మీ అంబులపొది లోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు. అమోఘం తారక్.. దుమ్ము లేపారు. మాలో ఉత్సాహాన్ని నింపారు. చరణ్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చారు తారక్….’’ అని చిరు పోస్ట్ చేశారు.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More