సమీక్ష : మేరా భారత్ మహాన్ – కథాంశం బాగున్నా సినిమా ఆసక్తికరంగా సాగదు !

Published on Apr 27, 2019 3:38 am IST

విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ, బాబు మోహన్, త‌ణికెళ్ల భ‌ర‌ణి, గిరిబాబు, ఆమని, ఎల్ బి శ్రీరాం తదితరులు

దర్శకత్వం : భ‌ర‌త్

నిర్మాతలు : డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టిపిఆర్

సంగీతం : ల‌లిత్ సురేష్‌

ఎడిటర్ : మేన‌గ శ్రీను

భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘ఎమ్‌బిఎమ్‌’ (మేరా భార‌త్ మ‌హాన్‌) స‌మ‌కాలీన అంశాల‌ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

మహన్ (శ్రీధర్ రాజు) తన జీవితంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల ప్రభావంతో ముఖ్యంగా సమాజంలో కొన్ని అసాంఘిక పనులను చూసి అలాంటి వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎమ్.బి.ఎన్ (మేరా భారత్ మహన్) అని పిలవబడే ఓ సంస్థను స్థాపిస్తాడు. ఈ క్రమంలో అవినీతి పరులైన రాజకీయ నాయకుల పై అలాగే కార్పొరేట్ ప్రపంచంలోని వాళ్ళు చేసే అవినీతిని బహిర్గతం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరి తానూ అనుకున్నది సాధించాడా ? లేదా ? అసలు ఏ పరిస్థితులలో తాను వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాడు ? ఈ పోరాడే క్రమంలో కార్తీక్ (అఖిల్ కార్తీక్) మరియు సంజన (ప్రియాంకా శర్మ) వంటి వాళ్ళు ఈ ప్రక్రియలో ఎలా సహాయపడ్డారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. సమాజంలో ఉన్న సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తుంది మరియు వ్యవస్థలోని లొసుగులను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కార్పొరేట్ నిర్వహణ మరియు విద్యా వ్యవస్థలకు సంబంధించి.. కొన్ని ఎపిసోడ్లు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు చాలా దగ్గరగా ఉన్నాయి.

అలాగే ప్రభుత్వ ఆస్పత్రులు మరియు హరితా హరమ్ మరియు అసమర్థమైన పరిపాలన వంటి అనేక పథకాలపై కూడా సినిమాలో వ్యంగ్యమైన చురకులు అంటించారు. ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, శ్రీధర్ రాజులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రం ప్రధానంగా సామాజిక సమస్యలతో సాగినప్పటికీ, దర్శకుడు అనుకున్న కథను తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. సినిమాలో ప్రధానంగా ప్లో లేని సన్నివేశాలతో, ఎలివేట్ కాని ఎమోషన్ తో సినిమాని చాలా బోరింగ్ గా నడిపారు.

సినిమాలో చెప్పుకోవడానికి ఎమోషనల్ క్యారెక్టర్స్, బలమైన సంఘర్షణలు ఉన్నాయి కానీ.. ఏది ఆసక్తికరంగా సాగదు. కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు పేపర్లో వచ్చినవే రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఇక సినిమాలో నటించిన నటీనటులను కూడా సరిగ్గా వాడుకోలేదు. ముఖ్యంగా గిరిబాబు మరియు బాబు మోహన్ లకు సంబంధించిన సీన్స్ ను ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడ పేపర్ మీద రాసిన స్క్రిప్ట్, స్క్రీన్ మీద ఆయన విజన్ కి తగ్గట్లు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. సంగీత దర్శకుడు అందించిన పాటల్లో ఒక పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

తీర్పు:

భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ మేరా భార‌త్ మ‌హాన్‌ ఆసక్తికరంగా సాగలేదు. అయితే కొన్ని స‌మ‌కాలీన అంశాల‌కు సినిమాలో ప్రస్తావించడం బాగుంది. అలాగే గ‌తంలో ప‌లు సామాజిక అంశాల‌ను చూపించడం ఆకట్టుకుంది. అయితే ఆకట్టుకోని కథ కథనం, ఆసక్తికరంగా సాగని సన్నివేశాలు, క్లారిటీ లేని పాత్రలు వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బతీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :