టీజ‌ర్ తో వచ్చిన ‘మార్ష‌ల్’ !

Published on May 5, 2019 4:48 pm IST

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ముఖ్య అతిధిగా.. మెడిక‌ల్‌, యాక్ష‌న్‌సైంటిఫిక్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం టీజ‌ర్‌ను ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల
స‌మావేశంలో… త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ…హీరో మ‌రియు నూత‌న ప్రొడ్యూస‌ర్ అభ‌య్‌కి, నూత‌న ద‌ర్శ‌కుడు జ‌య్‌కి ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ముందుగా కృత‌జ్ఞ‌త‌లు. చిన్న సినిమాల‌కు ప్ర‌మోష‌న్ ఎంతో అవ‌స‌రం అంద‌రం చిన్న సినిమాల‌ను ఆద‌రించాలి. మార్ష‌ల్ చిత్రం మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా చూశాక త‌ప్ప‌కుండా అంద‌రూ మెచ్చుకుంటారు. అభ‌య్ ప్రొడ్యూస‌ర్‌, హీరోగా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అలాగే జ‌య్‌కి కూడా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More