మరోసారి రిపీట్ కానున్న ‘మెర్సల్’ కాంబో !
Published on Nov 26, 2017 7:07 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’ తమిళనాట ఘన విజయాన్ని అందుకుని తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదలై అలరించింది. తెలుగులో ఈ చిత్ర విజయమే విజయ్ కు ఉత్తమ విజయంగా నమోదైంది. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇందులోని ఆడియో కూడా అంతే విజయాన్ని దక్కించుకుంది. అందుకు కారణం ఏ.ఆర్.రెహమాన్ సంగీతం.

దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయ సినిమాకు ‘మెర్సల్’ రూపంలో సంగీతం అందించిన ఆయన మరోసారి విజయ్ కోసం వర్క్ చేయనున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకు కూడా రెహమాన్ ను అనుకుంటున్నారట. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు.

సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాను జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టి దసరాకి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

 
Like us on Facebook