మాస్ ని ఊపేస్తోన్న మైండ్ బ్లాక్ సాంగ్ !

మాస్ ని ఊపేస్తోన్న మైండ్ బ్లాక్ సాంగ్ !

Published on Dec 4, 2019 11:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’.. మాస్ ప్రేక్షుకులకి బాగా కనెక్ట్ అయింది. సాంగ్ విడుదలైనప్పటి నుండే మాస్ ని విశేషంగా ఆకట్టుకుని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది ఈ సాంగ్. తెలుగు రాష్ట్రాల్లో ఆటోలు, టీ షాపులు, పార్టీలు… అంతటా మైండ్ బ్లాక్ మాస్ బీట్ మారుమోగుతోంది. ఫస్ట్ సాంగ్ కి వచ్చిన ఈ అద్భుత స్పందన కి సూపర్ స్టార్ అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు.

కాగా ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ లో దూసుకుళ్తోంది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. ఈ కాంటెస్ట్ లతో థ్రిల్ అయిన ఆడియన్స్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత విడుదల కానున్న సెకండ్ సాంగ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 11, 2019 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు