ఆ బిగ్ బాస్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ పాపులారిటీ

Published on Oct 12, 2019 8:52 am IST

గత ఆదివారం లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 ముగిసింది. విన్నర్ గా మలేసియాకు చెందిన యూట్యూబ్ సెన్సేషన్ మరియు సింగర్ అయిన మిగన్ రావ్ నిలిచారు. మిగన్ రావ్ మరియు శాండీ మాస్టర్ ఫైనల్స్ చేరుకోగా, ఉత్కంఠ మధ్య మిగన్ రావ్ విజేతగా నిలిచాడు. దీనితో అతనికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 50లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. కాగా ఈ యువ సింగర్ కి మలేసియాలో అద్భుత ఆదరణ లభిస్తుంది.

నిన్న మలేషియాలోని బాటు కేవ్స్ నందుగల ప్రముఖ సుబ్రమణ్య స్వామి టెంపుల్ కి మిగన్ రావ్ రానున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక గంటముందే అక్కడికి చేరుకొని ఆయన రాక కోసం ఎదురు చూశారట. ఇక మిగన్ రావడంతో ఆయన చుట్టూ చేరిన అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కొరకు పోటెత్తారట. ఒక మూవీ స్టార్స్ కి సమానంగా ఉన్న ఆయన క్రేజ్ చూసిన అక్కడ ఉన్న జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని సమాచారం. ఓట్లేసి తనను గెలిపించిన అభిమానుల ప్రేమకు మిగన్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More