మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 28, 2022 7:38 pm IST

చాలా సంవత్సరాల తర్వాత, తాప్సీ పన్ను మిషన్ ఇంపాజిబుల్ అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ను ఏప్రిల్ 1, 2022న థియేటర్‌లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈరోజు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని మార్చి 30, 2022 న నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, వేదిక మరియు ముఖ్య అతిథి వంటి ఇతర వివరాలను మేకర్స్ ప్రకటించలేదు. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్ మరియు జయ తీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :