‘మిస్ మ్యాచ్’ ట్రైలర్ లాంచ్ చేసిన సురేందర్ రెడ్డి

Published on Nov 20, 2019 8:36 pm IST

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ ,ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు ఇప్పటికే ప్రకటించారు.ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.

అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర యూనిట్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేంధర్ రెడ్డి చిత్ర ట్రైలర్ ను ప్రశంసించారు. తప్పకుండా మిస్ మ్యాచ్ మూవీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కౌసల్య కృష్ణ మూర్తి సినిమాలో క్రికెటర్ గా కనిపించిన ఐశ్వర్య రాజేష్ ఈ మూవీలో కుస్తీ క్రీడాకారిణిగా కనిపిస్తుంది. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More