‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెకండ్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెకండ్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

Published on May 30, 2023 8:21 PM IST

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్స్ గా తాజాగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫామిలీ యాక్షన్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. యువ దర్శకుడు పి. మహేష్ బాబు ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్, పోస్టర్స్, ఒక సాంగ్ అందరినీ ఆకట్టుకోగా హతవిధీ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని మే 31 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

కాగా ఈ సాంగ్ ని రేపు ఉదయం 11 గం. లకు విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ ఈ సాంగ్ ని పాడనుండడం విశేషం. సాడ్ బ్యాడ్ మోడ్ లో మెలోడియస్ గా ఈ పాట ఉంటుందని మేకర్స్ తాజాగా ఇచ్చిన అప్ డేట్ లో ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీకి రాధన్ సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ పై వంశీ, ప్రమోద్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. త్వరలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు