సమీక్ష: మిస్ యు – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా

సమీక్ష: మిస్ యు – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా

Published on Dec 13, 2024 5:57 PM IST
Miss You Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 13, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్, కరుణాకరన్, బాలశరవణన్ తదితరులు

దర్శకుడు : ఎన్.రాజశేఖర్

నిర్మాతలు : శామ్యుల్ మాథ్యూ

సంగీత దర్శకుడు : గిబ్రాన్

సినిమాటోగ్రఫీ : కె.జి.వెంకటేశ్

ఎడిటర్ : దినేష్ పొన్‌రాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యు’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

డైరెక్టర్ కావాలని చూస్తున్న వాసు(సిద్ధార్థ్) తనకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా రెండు సంవత్సరాల గతాన్ని మరిచిపోతాడు. బాబీ(కరుణాకరన్)ను కలిసిన వాసు జీవితంలో అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి. బెంగళూరులో సుబ్బలక్ష్మీ(ఆషికా రంగనాథ్)ని చూసిన వాసు, ఆమెను ప్రేమిస్తాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెబుతాడు. అయితే, ఆమె వాసు ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు వాసు. అయితే, తన గతానికి సంబంధించి ఓ ట్విస్ట్ తెలుసుకుంటాడు వాసు. అతడికి సుబ్బలక్ష్మీ ముందే తెలుసా? వాసు ప్రేమను సుబ్బలక్ష్మీ అంగీకరిస్తుందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సిద్ధార్థ్ వాసు పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆషికా రంగనాథ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించింది. ఆమె పాత్ర ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి.

కథలో కరుణాకరన్ పాత్రతో పాటు మరికొన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి. కథను నెరేట్ చేసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్:

‘మిస్ యు’ సినిమా కథ మంచి పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. అయితే, కథ ముందుకు వెళ్తున్న కొద్ది సినిమా నెరేషన్ ఆసక్తిని మెయింటెయిన్ చేయలేకపోయింది. వాసు పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకోదు. అతడి పాత్రను ఇంకాస్త డెవెలప్ చేసి ఉండాల్సింది.

హీరోహీరోయిన్ల మధ్య ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వారి మధ్య రొమాంటిక్ డ్రామా కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. చాలా సీన్స్ రాంగ్ టైమింగ్‌లో ఉండటం, అనవసరమైన పాత్రలు కథను సాగదీసినట్లుగా చేస్తాయి.

ఫస్ట్ హాప్ కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాప్ మాత్రం సినిమాకు డ్యామేజ్ చేసింది. సినిమాకు సరైన ముగింపు ఇవ్వలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు ఎన్.రాజశేఖర్ రాసుకున్న కథ బాగున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్ ఫైర్ అయ్యాడు. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ మిస్ అయింది. సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గిబ్రాన్ అందించిన బీజీఎం బాగున్నా, పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది.

తీర్పు:

‘మిస్ యు’ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడంలో మిస్ ఫైర్ అయ్యింది. సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకోకపోవడం వంటివి ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. అనవసరమైన సీన్స్, ఆకట్టుకోని కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు