వెంకీ మామలో మిస్టర్ ఇండియా !

Published on May 27, 2019 2:19 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ వార్తా పత్రిక కథనం మేరకు ఈ చిత్రంలో ప్రముఖ మోడల్ ప్రతీక్ జైన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీక్ జైన్ 2014లో ప్రవోగ్ మిస్టర్ వరల్డ్ ఇండియా నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి బాగా పాపులర్ అయ్యారు.

గ్లామర్‌తో పాటు మంచి బాడీ లాంగ్వేజ్ కలిగి ఉండటంతో అతన్ని సినిమాలోకి తీసుకున్నారట దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఇతనిపై కొంత షూటింగ్ కూడా జరిగిందట. ఫిల్మ్ నగర్ వర్గాల ఇన్ఫర్మేషన్ మేరకు అతను చేయబోయే పాత్ర ప్రతినాయకుడి పాత్రని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘మజిలీ’లాంటి హిట్ తరవాత చైతన్య, ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ చేస్తున్న చిత్రం కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More