‘మిస్టర్’ రెస్పాన్స్ కిక్ ఇచ్చింది : వరుణ్ తేజ్
Published on Jan 5, 2017 8:11 pm IST

mister
యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘మిస్టర్‌’కు సంబంధించిన ఫస్ట్ టీజర్ ఈ మధ్యే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తన గత రెండు చిత్రాలూ ఘోర పరాజయం పాలవ్వడంతో దర్శకుడు శ్రీనువైట్ల మిస్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల స్టైల్లో కాకుండా ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మిస్టర్ తెరకెక్కినట్లు టీజర్ స్పష్టం చేసింది.

ఇక ఈ టీజర్ ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 2 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. వరుణ్ తేజ్ స్థాయి హీరో సినిమా టీజర్‍కు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విశేషమనే చెప్పాలి. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు ఈ రెస్పాన్స్‌తో తనకు కిక్ ఇచ్చారని వరుణ్ తేజ్ అన్నారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook