విదేశాల్లో ఆడిపాడుతున్న కాజల్, కళ్యాణ్ రామ్ !
Published on Mar 7, 2018 11:48 am IST

కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎం.ఎల్.ఎ’. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం అజీర్ భాయ్జాన్ లోని బాకు ప్రాంతంలో పాట చిత్రీకరణను జరుపుకుంటోంది. జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ సాంగ్ రూపొందుతోంది.

మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని మొదటి పాట ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ కంటెంట్ కూడ బాగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. మార్చి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

 
Like us on Facebook