“ఆర్ఆర్ఆర్”లో ఆ పాట పాడిన అసలు చిన్నారి ఎవరంటే..!

Published on Apr 5, 2022 1:23 am IST

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటనలకే కాకుండా “మల్లి” అనే పాత్ర చేసిన చిన్నారి పర్ఫార్మెన్స్‌కు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే ఆ చిన్నారి బ్రిటీష్ దొరసాని చేతి మీద డిజైన్ వేస్తూ “కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా..” అంటూ పాడే సాంగ్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. అయితే అసలు ఈ సాంగ్‌ని రియల్‌గా పాడింది మాత్రం చిన్నారి గాయని ప్రకృతి అని తెలిసిందే.

అయితే చిన్నారి ప్రకృతి ఈ సాంగ్ పాడిందని, ఈ సాంగ్‌ని 2019 మార్చి 15న ప్రసాద్ ల్యాబ్స్‌లో రికార్డ్ చేశామని, అప్పుడు ఆ చిన్నారి వయస్సు కేవలం తొమ్మిదేళ్ళు మాత్రమేనని తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ చిన్నారి చాలా టాలెంటెడ్ అని అన్నాడు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ బీజీఎంను ప్రశంసించిన వారందరికి ధన్యవాదాలు అని, ఈసారి నేను ఆలస్యం చేయను.. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఒక నెలలోపు విడుదల అవుతుందని, అందులో మల్లి పూర్తి పాట ఉంటుందని కీరవాణి చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :