కొత్త దర్శకులకి శుభారంభాన్నిచ్చిన 2011 సంవత్సరం

కొత్త దర్శకులకి శుభారంభాన్నిచ్చిన 2011 సంవత్సరం

Published on Dec 18, 2011 3:58 PM IST

 

ఈ 2011 సంవత్సరం చివరికి చేరుకుంది. ఈ సంవత్సరంలో కొంతమంది నూతన దర్శకులు తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటగా నందిని రెడ్డి గురించి చెప్పుకుందాం. ‘అలా మొదలైంది’ చిత్రంతో దర్శకురాలిగా తన మొదటి సినిమా చేసింది నందిని. జనవరిలో విడుదలైన ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. మొదటి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకున్న నందిని ప్రస్తుతం సిద్ధార్థ్-సమంత జంటగా బెల్లంకొండ సురేష్ నిర్మించబోయే చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతుంది. ఈ జాబితాలో తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు ‘ఎల్బీడబ్ల్యు’ చిత్రంతో మన ముందుకి వచ్చారు. పెళ్ళికి ముందు యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రవీణ్ ప్రస్తుతం ‘రొటీన్ లవ్ స్టొరీ’ అనే చిత్రం తీస్తున్నారు. మరొక దర్శకుడు వీర భద్రం. అల్లరి నరేష్ నటించిన ‘అహ నా పెళ్ళంట ‘ చిత్రం తీసిన వీర భద్రం ప్రస్తుతం సునీల్ తో ‘పూల రంగడు’ అనే సినిమాకి డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. రామ్ తో కందిరీగ చిత్రం తీసి బాక్స్ ఆఫీసుకి మంచి హిట్టిచ్చాడు సంతోష్ శ్రీనివాస్ . వీరే కాకుండా భారీ చిత్రాలు ‘దడ ‘ తో అజయ్ భూయాన్ , ‘బెజావాడ ‘ తో వివేక్ దర్శకుడి అవతారం ఎత్తి బాక్స్ ఆఫీసు దగ్గర చతికిల పడ్డారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు