‘బాహుబలి’ తర్వాత జక్కన్న రాజమౌళి స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న రకరకాల వార్తల మేరకు ఈ సినిమాలో చరణ్, తారక్ లతో పాటే మరొక ముఖ్యమైన పాత్రలో ఇంకో స్టార్ హీరో కనిపిస్తారని మాటలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఆ పాత్రలో బన్నీ నటిస్తాడని కూడా అంటున్నారు. మరి ఈ వార్తలో ఏ మేరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. అక్టోబర్లో మొదలుకానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతోను, చరణ్ ‘రంగస్థలం’, బోయపాటి శ్రీను చిత్రాలతోను బిజీగా గడుపుతున్నారు.


