
అల్లు అర్జున్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ వుంది. ఆంధ్రతో పాటు కేరళలో కూడా అల్లు అర్జున్ చాలా పెద్ద హీరో గా పేరు సంపాదించారు.
బన్నీ చిత్రాలు ఎన్నో మలయాళం లో విడుదల అయ్యి ఘన విజయం సాధించాయి. ఇటివల బన్నీ ప్రముఖ నగల బ్రాండ్ జాయ్ అల్లుకాస్ కొత్త షోరూం కేరళలోని త్రిస్సూర్ లో ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు తన ఫ్యాన్స్ ని కలుసుకునే అవకాశం వచ్చింది.
అల్లు అర్జున్ సిటీ లో వున్నాడన్న వార్త తెలియగానే షోరూం దగ్గర పోట్టేతిన జనం సందడి చేసారు. ఆ జనాన్ని నియంత్రించడానికి సెక్యూరిటీని పెంచవలసి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ విజయోత్సాహం లో వున్నాడు.

