
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘శివమ్’ పేరుతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న భారీఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పండగ చేస్కో లాంటి మంచి విజయం తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో శివమ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో సక్సెస్‌తో పాటు సినిమా రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రచారం చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా హీరో రామ్, హీరోయిన్ రాశి ఖన్నాలు ఆంధ్ర, తెలంగాణ మొత్తం తిరిగి సినిమాని ప్రమోట్ చేసారు. హైదరాబాద్ నుంచి మొదలు పెట్టి ఆంధ్ర, విజయవాడ, వైజాగ్, వరంగల్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ సందడి చేసారు. వైజాగ్ లో ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసారు. ఓవరాల్ గా శివమ్ ప్రీ ప్రమోషనల్ టూర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా పెద్ద ఎత్తున తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే!

