కోలుకుంటున్న నాజర్ కొడుకు

కోలుకుంటున్న నాజర్ కొడుకు

Published on May 25, 2014 1:17 AM IST

Nasser's-son
కొద్దిరోజుల క్రితం సీనియర్ నటుడు నాజర్ పెద్దకొడుకు అబ్దుల్ అసన్ ఫైసల్ చెన్నైలో ఆక్సిడెంట్ కి గురయ్యి ప్రమాదపరిస్థితిలో వున్న సంగతి విదితమే. తాజా సమాచారం ప్రకారం ఫైసల్ కి ఒక పెద్ద సర్జరి జరిగింది. ఇప్పుడు కోలుకుంటున్నాడు.

గతవారం ఫైసల్ నడుపుతున్న కార్ వేరే వాహనాన్ని డీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతనితో పాటు వున్నా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫైసల్ ఒకరే ప్రమాదపరిస్థితిలో బయటపడ్డారు.

నాజర్ భార్య కమీలా నాజర్ తన కొడుకు యొక్క తాజా పరిస్థితిని ట్వీట్ చేస్తూ తన కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రార్ధన చేయమని అందరిని అభ్యర్దించారు.

తాజా వార్తలు