రామ్ చరణ్ చిత్రం లో ప్రకాష్ రాజ్

రామ్ చరణ్ చిత్రం లో ప్రకాష్ రాజ్

Published on May 25, 2014 3:56 AM IST

Ram-Charan's-Govindudu-Anda
తాజా పరిమాణాల ప్రకారం నేషనల్ అవార్డ్ పొందిన నటుడు ప్రకాష్ రాజ్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం లో ఒక ప్రత్యేక పాత్ర లో అలరించనున్నాడు.

ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ తమిళ నటుడు రాజ్ కిరణ్ ని భర్తీ చేయనున్నాడు. ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం లో ప్రకాష్ రాజ్ రామ్ చరణ్ తాత పాత్ర పోషించనున్నాడు. థమన్ స్థానాన్ని యువన్ శంకర్ రాజా గతంలో భర్తీ చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ఇది రెండవ మార్పు అని చెపొచ్చు.

షూటింగ్ పూర్తికావొస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజీపడకుండా చిత్రీకరిస్తున్నారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు