విజయ్ దేవరకొండను మెచ్చుకున్న రామ్ చరణ్ !

Published on Aug 17, 2018 5:13 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో కామెడీ బాగా పేలడంతో, విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులతో పాటు సెలబ్రేటిస్ కూడా ఈ చిత్రాన్ని బాగా మెచ్చుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్రం పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా స్పందించారు. ‘ అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ దేవరకొండ పర్‌ఫెక్ట్‌ గా మారిపోయాడు. విజయ్‌, రష్మికల నటన వారి మధ్య కెమిస్ట్రీ ఓ ట్రీట్‌లా ఉంది. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా చాలా బాగా ఆకట్టుకుంది. స్టోరీ, స్రీన్ ప్లే కూడా బాగున్నాయి. పరుశురామ్‌ కు కంగ్రాట్స్‌. ఈ సినిమా ఇంతబాగా రావటానికి సహకరించిన, పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌ కు కంగ్రాట్స్‌’ అని తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More