రామ్ సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్లు లేరు !
Published on Mar 15, 2018 3:39 am IST

త్రినాధ్ దర్శకత్వంలో రామ్ నటిస్తోన్న ‘హలోగురు ప్రేమకోసమే’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయిక నటించబోతోందన్న విషయం తెలిసిందే. సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో ముందు సురభి పేరు వినిపించింది ఆ తరువాత మేఘ ఆకాష్ చేస్తోందని వార్తలు వచ్చాయి కానీ వాస్తవానికి ఇద్దరు ఈ సినిమాలో చేయడం లేదని సమాచారం.

ఈ మొవీలో నటించే సెకండ్ హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook