ప్రమోషన్స్ కు మహర్షి ని వాడుకుంటున్న సీత !

Published on May 8, 2019 2:30 pm IST

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్నతాజా చిత్రం ‘సీత’ ఈ నెల 24న విడుదలకానుంది. ఇక ఇప్పటికే ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ చిత్రానికి మహర్షి రూపంలో మంచి అవకాశం దొరికింది. రేపు మహేష్ బాబు నటించిన మహర్షి భారీ స్థాయిలో విడుదలకానుందని తెలిసిందే. దాంతో మహర్షి ని ప్రదర్శించే థియేటర్లలో ఈ సినిమాతో పాటు సీత ట్రైలర్ ను కూడా ప్రదర్శించనున్నారు.

తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్ విలన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More