వైరల్ అవుతున్న మోదీ ఆస్కార్ వీడియో !

Published on May 22, 2021 9:16 pm IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రధాని మోదీకి షాక్ ఇచ్చాడు. ఏకంగా మోదీ పైనే ఓ ఫన్నీ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కరోనా కఠిన పరిస్థితుల పై ప్రధాని మోదీ ఓ సందర్భంలో భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన వీడియోని తీసుకుని, అలాగే ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అవార్డుల ప్రకటనకి సంబంధించిన వీడియోలో ప్రధాని వీడియోని ఎడిట్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రధానిని కించపరిచేట్టు ఉందని నరేంద్ర మోదీ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

అయినా వీడియోలో మోదీ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డుకు అర్హులు అనే సెన్స్ వచ్చేలా వర్మ ఇలా ఫన్నీగా వీడియో పోస్ట్ చేయడం బాగాలేదని, దేశంలో కరోనా విజృంభిస్తున్న తీరుకు ప్రజలు భయంతో వణికిపోతుంటే.. వర్మ ఇలా బాధ్యతారహితంగా మోదీ పై సైటర్లు వేయడంతో మొత్తానికి ఇది హాట్ టాపిక్ అయింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేసినందుకు వర్మ పై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ అభిమానులు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం :