అక్రమ సంబంధం నేపథ్యంలో వర్మ ‘మొగలిపువ్వు’!

అక్రమ సంబంధం నేపథ్యంలో వర్మ ‘మొగలిపువ్వు’!

Published on May 16, 2015 7:45 PM IST

mogalipuvvu
రామ్ గోపాల్ వర్మ అంటే ఓ వివాదం, రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు సినిమాకు ఓ కొత్త దారిని చూపిన మాస్టర్ ఫిల్మ్‌మేకర్. క్రైమ్, హర్రర్, డ్రామా, థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లలో సినిమాలు తీసిన వర్మ, తాజాగా రొమాన్స్ జానర్లో ‘365డేస్’ పేరుతో ప్రేమ, పెళ్ళి మధ్య నడిచే ఓ డిఫరెంట్ కథను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇదే పెళ్ళి, భార్యా భర్తల బంధం, అక్రమ సంబంధాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘మొగలి పువ్వు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

“ప్రతీ పెళ్ళైన మగాడి సెల్‌ఫోన్‌లో భార్యకు తెలియని ఓ రహస్య జీవితం ఉంటుంది” అంటూ విడుదలైన ‘మొగలి పువ్వు’ సినిమా ట్రైలర్‌లో రామ్ గోపాల్ వర్మ మార్క్ థ్రిల్లర్ సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్ జోషి, మీరా చోప్రాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో జెడ్ 3 ప్రొడక్షన్స్ నిర్మించింది. పెళ్ళైన ఓ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధాన్ని పెట్టుకోవడం, ఆ తర్వాత అతడి జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గత కొంతకాలంగా సరైన హిట్‌లేని వర్మ మరి ఈ సినిమా ద్వారా అభిమానులను థ్రిల్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

మొగలిపువ్వు ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు