అలనాటి హీరోయిన్స్ తో స్టెప్స్ వేసిన మోహన్ బాబు

అలనాటి హీరోయిన్స్ తో స్టెప్స్ వేసిన మోహన్ బాబు

Published on May 19, 2015 8:34 PM IST

mohan-babu
పద్మశ్రీ దా. మోహన్ బాబు ఇంట్లో ఇప్పుడు పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. మోహన్ బాబు చివరి తనయుడు మంచు మనోజ్ వివాహ మహోత్సవం ఈ నెల 20 అనగా రేపు హైదరాబాద్ లో జరగనుంది. ఈ సందర్భంగా వారం – పది రోజుల నుంచే మంచు వారి ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ ని పెళ్లి కొడుకుని చేయడం, ఇంట్లో బంధుమిత్రులు సందడి, లాగే సంగీత సెరెమనీ లాంటివి రోజూ జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం మంచు లక్ష్మీ ఆధ్వర్యంలో మంచు మనోజ్ సంగీత సెరెమనీ జరిగింది.

ఈ కార్యక్రామానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సంగీత్ నుంచి అందిన సమాచారం ప్రకారం తన కుమారుడి పెళ్లి సందర్భంగా ఎంతో హ్యాపీగా ఉన్న మోహన్ బాబు ఆయనతో నటించిన అలనాటి హీరోయిన్స్ తో కలిసి స్టేజ్ పైన స్టెప్పు లేసారు. ఈ వేడుకకి హాజరైన అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రద, రవీన టాండన్ లు మోహన్ బాబుతో కలిసి సరదాగా అలంటి పాటలకు డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసారు. మధ్యలో వీరితో పాటు అందాల భామ హన్సిక కూడా జాయిన్ అవ్వడం విశేషం. మంచు లక్ష్మీ కూడా తన భర్త ఆండీతో కలిసి ఓ పాటకి డాన్స్ చేసింది. రేపు ఉదయం 9:20 నిమిషాలకు మంచు మనోజ్ – ప్రణతిల వివాహ మహోత్సవం జరగనుంది.

తాజా వార్తలు