‘ఎన్టీఆర్’ సినిమాలో మోక్షజ్ఞ ?

‘ఎన్టీఆర్’ సినిమాలో మోక్షజ్ఞ ?

Published on Jul 4, 2018 3:09 PM IST

Mokshagna
నందమూరి మూడో తరం వారసుడిగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఐతే గత కొంత కాలంగా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ కూడా హీరోగా పరిచయం అవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ చిత్రంలోని యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రను మోక్షజ్ఞ పోషిస్తే బాగుంటుందని క్రిష్ అభిప్రాయపడ్డారట. దీనికి బాలయ్య కూడా అంగీకరించారని తెలుస్తోంది.

ఇక ఈ మధ్య కొంచెం లావు పెరిగిన మోక్షజ్ఞ, ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు ప్రస్తుతం లావు తగ్గే ప్రయత్నంలో ఉన్నాడని సినీవర్గాల నుంచి సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ ఎన్టీఆర్‌ బయోపిక్ లో నటిస్తే నందమూరి అభిమానులకి పండగనే చెప్పాలి. భారీ తారాగణంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రామకృష్ణ స్టూడియోస్ లో నిర్మించిన భారీ సెట్లో రేపటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది.

తాజా వార్తలు